రాజేంద్రప్రసాద్ ఇంటి వద్ద ఉద్రిక్తత

TRINETHRAM NEWS

Trinethram News : ఉయ్యూరు

పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర ఆధ్యక్షుడు వై.వి.బి. రాజేంద్రప్రసాద్కు అమరావతి “ఛలో అసెంబ్లీ” ముట్టడికి అనుమతి లేదని పోలీసులు ఉయ్యూరులో హౌస్ అరెస్టు చేశారు.

మంగళవారం రాజేంద్ర ప్రసాద్ ఛలో అసెంబ్లీకి బయలుదేరారు.

ఉయ్యూరు టౌన్, రూరల్ పోలీసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ప్రసాద్ బయటకు వెళ్లకుండా అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఇంటి వద్ద కూర్చొని ప్రభుత్వ వైఖరిపై రాజేంద్ర నిరసన తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top