మణికొండలో కారులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది

TRINETHRAM NEWS

మణికొండ: రంగారెడ్డి జిల్లా మణికొండలో కారులో మృతదేహం లభ్యం కావడం కలకలం రేపుతోంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలిని నార్సింగి పోలీసులు పరిశీలించారు. మారుతి వ్యాన్‌లో ఉన్న మృతదేహాన్ని మణికొండకు చెందిన ఆటోడ్రైవర్‌ రమేశ్‌దిగా గుర్తించారు. శనివారం స్నేహితులతో కలిసి ఆయన యాదగిరిగుట్టకు వెళ్లి వచ్చినట్లు సమాచారం. స్నేహితులతో గొడవ జరిగి రమేశ్‌ హత్యకు గురయ్యాడా? అనారోగ్యంతో మృతి చెందాడా? ఆత్మహత్యా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

You cannot copy content of this page

Scroll to Top