బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి

TRINETHRAM NEWS

అనంతపురం : బదిలీపై వెళ్లిన అధికారులు అధికార పార్టీ నేతలను ప్రసన్నం చేసుకోవడానికి ఆరాటపడటంపై విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలు అత్యంత పారదర్శకంగా జరగాలంటే పోలీసుల పాత్ర కీలకం. అందుకే ఎన్నికలకు ముందు ఒకే జిల్లాలో చాలాకాలం పనిచేసిన వారిని ఇతర జిల్లాలకు బదిలీ చేస్తారు. అలా.. బదిలీపై వచ్చిన డీఎస్పీ శివభాస్కర్‌రెడ్డి గుంతకల్లులో బాధ్యతలు చేపట్టారు. వచ్చిన మొదటి రోజే గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డితో భేటీ అయ్యారు. పైగా.. నియోజకవర్గంలోని సీఐలు, ఎస్సైలందరినీ ఎమ్మెల్యే ఇంటికే పిలిపించుకొని మాట్లాడారు. అధికార పార్టీ నేతలతో అంటకాగే అధికారులు ఎన్నికల విధుల్లో ఎలా నిష్పక్షపాతంగా ఉండగలరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

You cannot copy content of this page

Scroll to Top