
ఒక మహిళ పై కేసు నమోదు.
20, లీటర్ల నాటు సారా , 180 కేజీల నల్లబెల్లం , 90 కేజీల పటిక స్వాధీనం . —దేవరకొండ ఎక్సైజ్ ఇన్చార్జి :– సి ఐ . జీ హరికృష్ణ .
Surprise Raid : దేవరకొండ డివిజన్ నవంబర్ 01, త్రినేత్రం న్యూస్. నల్గొండ జిల్లా డిండి మండలం డాక్యా తండా గ్రామంలో ఆదివారం దేవరకొండ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నాటు సారా స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు.
ఈ దాడిలో పట్టుబడిన ఒక మహిళపై కేసు నమోదు చేశారు. ఆమె వద్ద నుండి 20 లీటర్ల నాటు సారాయి, 180 కిలోల నల్ల బెల్లం, 90 కిలోల పటికను స్వాధీనం చేసుకున్నారనీ తెలిపారు. నాటు సారా తయారీ మరియు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దేవరకొండ ఎక్సైజ్ ఇన్ఛార్జ్ సీఐ జి. హరికృష్ణ హెచ్చరించారు.
ఈ రైడ్ లో ఎక్సైజ్ ఎస్ఐ మం. గురువయ్య, సిబ్బంది క్రాంతి, సురేష్ తదితరులు లు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe