
-బ్రదర్ షఫీ
Register voters : డిండి( గుండ్లపల్లి) నవంబర్ 01, త్రినేత్రం న్యూస్. పట్టభద్రులు నవంబర్ 6 వ తేదీలోగా ఓటరుగా నమోదు చేసుకోవాలని ప్రముఖ యూట్యూబర్, బ్రదర్ షఫీ పిలుపునిచ్చారు. ఆయన ఆదివారం డిండి మండల కేంద్రంలోని షాదీఖానాలో మాట్లాడుతూ…. అవినీతి రాజకీయాలను తరిమికొట్టాలని, రాజకీయ వ్యవస్థనే సమూలంగా మార్చేందుకు కృషి చేయాలని అన్నారు. 1 నవంబర్ 2023 లోపు డిగ్రీ పూర్తి చేసిన వారు తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.
వరంగల్, ఖమ్మం, నల్లగొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో స్వతంత్ర అభ్యర్థిగా బ్రదర్ షఫీ బరిలో ఉంటారని అన్ని వర్గాల ఎమ్మెల్సీ ఓటర్లు తనను ఆదరించాలనీ కోరారు.. అనంతరం బ్రదర్ షఫీని ముస్లిం మైనార్టీ నాయకులు శాలువాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ అధ్యక్షులు , ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe