అక్టోబర్ 31, 2026
TRINETHRAM NEWS
Cyclone Causes Disruption

కొండచరియలు విరిగిపడి రైల్వే ట్రాక్‌పై బండరాళ్లు.. బీసుపురం వద్ద కూలిన రక్షణ గోడ

Cyclone Causes Disruption : అరకులోయ అక్టోబర్ 31, (త్రినేత్రం న్యూస్): ఆర్నాబ్ తుఫాన్ ప్రభావంతో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు ప్రాంతంలో రైలు, రహదారి మార్గాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్తవలస–కిరండూల్ రైల్వే లైన్‌లోని 40వ నంబర్ టన్నెల్ సమీపంలో కొండచరియలు విరిగిపడి భారీ బండరాళ్లు పట్టాలపై పడటంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో గూడ్స్ రైళ్లతో పాటు పర్యాటకుల ప్యాసింజర్ రైళ్లను కూడా రద్దు చేశారు. రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పూర్తయ్యే వరకు అరకు పర్యాటకులు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు, అరకు ఘాట్ రోడ్డులోని బీసుపురం సమీపంలో రక్షణ గోడతో పాటు రోడ్డు సగభాగం కూలిపోవడంతో అరకు–విశాఖపట్నం మధ్య వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అధికారులు మరమ్మతు పనులను ముమ్మరంగా రాత్రి పగలు చేపడుతున్నారు. తాత్కాలికంగా ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. బస్సులు, భారీ వాహనాలు, గూడ్స్ వాహనాల రాకపోకలకు మరమ్మతులు పూర్తయ్యే వరకు అనుమతి లేదని అధికారులు స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page