అక్టోబర్ 30, 2026
TRINETHRAM NEWS
Cyclone Arnab

నేలవాలిన వాణిజ్య పంటలు.. దిక్కుతోచని స్థితిలో గిరిజనులు

Cyclone Arnab : అరకులోయ అక్టోబర్ 31 (త్రినేత్రం న్యూస్): అర్నబ్ తుఫాన్ రైతన్నలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, వీచిన ఈదురుగాలులకు అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలంలోని పలు గ్రామాల్లో పంట పొలాలు నీటమునిగాయి. ముఖ్యంగా శిరగం పంచాయతీ, మరియు బస్కీ దేవరపల్లి, పద్మాపురం పంచాయతీలో రణ జిల్లేడ వాటర్ఫాల్ సమీపం పరిధిలోని గ్రామాల్లో వరి, పంటలు తీవ్రంగా దెబ్బతినడంతో గిరిజనులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరికొద్ది రోజుల్లో చేతికి అందుతుందనుకున్న వరి పంట తుఫాన్ ధాటికి నేలవాలాయి. భారీ వర్షాలకు పొలాల్లోకి వరద నీరు చేరడంతో పంటలు నీట మునిగిపోయాయి. దీంతో నెలల తరబడి కష్టపడి సాగు చేసిన పంటలు కళ్లముందే దెబ్బతినడంతో గిరిజనులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఈ ఏడాది సరైన సమయంలో వర్షాలు కురవకపోవడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమీపంలోని ఊటగడ్డల నుంచి నీటిని తెచ్చి, ఎంతో శ్రమించి పంట పొలాలకు నీరు అందించారు. పంట చేతికి వచ్చే దశలో అర్నబ్ తుఫాన్ రూపంలో ప్రకృతి విపత్తు విరుచుకుపడటంతో తమ ఆశలన్నీ ఆవిరయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టాన్ని
అధికారులు స్పందించి ఆదుకోవాలి సంబంధిత వ్యవసాయ, రెవెన్యూ అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. నష్టపోయిన ప్రతి రైతును గుర్తించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం తగిన పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page