అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
New Road

రూ.3.46 కోట్లతో 3.7 కి.మీ. రహదారి ప్రారంభం

New Road : అనంతగిరి అక్టోబర్ 6,(త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం బొర్రా పంచాయతీ పరిధిలోని టోకూరు–బొర్రాపులుగుడ గ్రామాల మధ్య నిర్మించిన 3.7 కిలోమీటర్ల “అడవి తల్లి బాట” రహదారి సోమవారం ప్రారంభమైంది. రూ.346 లక్షల వ్యయంతో నిర్మించిన ఈ రహదారిని జనసేన అనంతగిరి మండల అధ్యక్షుడు చిట్టం మురళి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సమరెడ్డి దొన్ను అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిట్టం మురళి మాట్లాడుతూ.. గిరిజన గ్రామాలకు రహదారులు అభివృద్ధికి తొలి అడుగని అన్నారు. రహదారి అందుబాటులోకి రావడంతో ప్రజల రాకపోకలతో పాటు వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్యార్థుల ప్రయాణం, అత్యవసర వైద్య సేవలకు సౌకర్యం కలుగుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అడ్డాల సోమరాజు, జనసేన నాయకులు కొర్ర ప్రవీణ్‌కుమార్, గుజ్జెల మంగళ, టీడీపీ నాయకుడు టీ. ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page