WhatsApp Image 2024 02 03 at 8.06.27 AM
Trinethram News : విజయనగరం జిల్లా కొండపల్లి తహశీల్దార్ రమణయ్య కొమ్మాదిలో చొరన్ క్యాపిటల్ అపార్ట్ మెంట్ లో వుండగా అర్థ రాత్రి అపార్ట్ మెంట్ లోకి దుండగులు చొరబడి హత్య చేశారు. వాచ్మెన్ కేకలు వేయటంతో పరుగులు పెట్టిన దుండగులు.
వెంటనే హాస్పటిల్ కి తరలించగా చికిత్స పొందుతూ కొండపల్లి తహశీల్దార్ రమణయ్య మృతి చెందారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన విశాఖపట్నం సీపీ రవి శంకర్ ఇంకా పూర్తి వివరాలు చెప్పాల్సి వుంది.
నిజాయితీ పరుడుగా మంచి పేరు తెచ్చుకున్న రమణయ్య హత్యకి లాండ్ మాఫియా వివాదాలే కారణమని అనుమానిస్తున్నారు.
నిందితులు కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
ఇటీవల విశాఖ పట్నం చిన్న గదిలీ నుంచి విజయనగరం జిల్లా కొండపల్లికి బదిలీ అయ్యారు.
