
Maha Anna Prasadam : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్25, త్రినేత్రం న్యూస్, డిండి మండల కేంద్రంలోని శ్రీరామ్ నగర్ లో వెలసిన గణనాథుడి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మహా అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎస్సై సిహెచ్ బాలకృష్ణ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మహా అన్నప్రసాదానికి మండలంలోని వివిధ గ్రామాల మహిళలు, యువకులు, అధికారులు, నాయకులు గణనాథుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారని శ్రీరామ్ నగర్ ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు.

స్వామివారి అన్నప్రసాద నివేదనకు మరియు నిత్య పూజల కోసం.. దివ్వెలు, కుంకుమ గిన్నెలు మరియు అగర్బత్తి స్టాండ్‌తో కూడిన ఈ ‘నీతూ ఆర్ట్స్ బ్రాస్ పూజా థాలి సెట్’ను అమెజాన్ నుండి ఇక్కడ తక్కువ ధరకే ఆర్డర్ చేయండి.