సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
NSS Day

NSS Day : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 24, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని మునగాల కొండల్ రావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), లో ఎన్ఎస్ఎస్ యూనిట్ I & II విభాగాల ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ నిర్మూలనపై ప్రతిజ్ఞ మరియు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండి శ్రద్ధగా చదువుకుని భవిష్యత్తులో మంచి స్థానంలో నిలవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ కె.పృథు, ఎన్సిసి సి టి వో ఆర్. నాగేందర్, ఎన్ఎస్ఎస్ యూనిట్ I ఆఫీసర్ డాక్టర్ వి.మకట్లాల్, యూనిట్ II ఆఫీసర్ & అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, తదితర అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page