సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Students Excel Sports

–డిండి లోఎస్ జి ఎఫ్ డివిజన్ స్థాయి క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే .

Students Excel Sports : డిండి (గుండ్ల పల్లి)సెప్టెంబర్ 24, త్రినేత్రం న్యూస్. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడల్లో భాగంగా దేవరకొండ డివిజన్ క్రీడలను గురువారం దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ స్థానిక జడ్పీ హైస్కూల్ గ్రౌండ్ లోప్రారంభించారు. దేవరకొండ డివిజన్ లోని ఎనిమిది మండలాల నుంచి క్రీడాకారులు కబడ్డీ, వాలీబాల్, ఖో ఖో,బాల బాలికల జట్లు పాల్గొని తమ క్రీడా ప్రతిభను చూపి, నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను డివిజన్ స్థాయి జట్టుకు ఎంపిక చేసి, జిల్లా స్థాయి పోటీలకు పంపిస్తామని డివిజన్ క్రీడలకు కన్వీనర్ ఐ జయమ్మ ఫిజికల్ డైరెక్టర్ తెలిపారు.విద్యార్థులచే మార్చి పాస్ట్ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు.జాతీయ పతాకాన్ని ఎమ్మెల్యే బాలు నాయక్ ,, క్రీడా పతాకాన్ని తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్ ఎగురవేశారు.
ఈ సందర్భంగా స్థానిక ఆర్పి ఆర్పి పాఠశాల విద్యార్థి నీలచే ఆలపించిన నృత్యం క్రీడాకారులను, అతిథులను ఆకట్టుకుంది.ఈ సమావేశానికి జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు గీతాంజలి రెడ్డి అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పాఠశాలకు కావలసిన మౌలిక వసతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్థానిక హై స్కూల్ కు కావలసిన మౌలిక వసతులను తాను గుర్తించానని, త్వరలోనే వాటిని ఏర్పాటు చేస్తామని ఆయనతెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, దేవరకొండ డివిజన్ లో క్రీడా అకాడమీ నెలకొల్పుటకు కృషి చేస్తానని ,అదేవిధంగా సెప్టెంబర్ 30న జరగబోయే జిల్లా స్థాయి క్రీడలను దేవరకొండ పట్టణంలో నిర్వహించుటకు కృషి చేస్తానని అన్నారు
.క్రీడాకారులు క్రమశిక్షణతో, ఎంపైర్ల నిర్ణయాన్ని కట్టుబడి, క్రీడల్లో పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి క్రీడాజట్లకు ఎంపిక కావాలని సూచించారు.దేవరకొండ డివిజన్లోని ఎనిమిది మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులైన బాలబాలికలకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు .గురువారం బాలురు బాలికల అండర్ 17 క్రీడా పోటీలు నిర్వహించినట్లు, శుక్రవారం అండర్ 14 బాలబాలికల జట్లకు క్రీడా పోటీలు ఉంటాయని ,క్రీడల కో కన్వీనర్ జే చంద్రయ్య ఫిజికల్ డైరెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వేజన .ఎంఈఓ నరసింహ,,సిఐ బిసన్న, ఎస్సై బాలకృష్ణ ,స్థానిక సర్పంచ్ నల్ల గంతుల రవి, ఉప సర్పంచ్ కౌసర్ రషీద్, ఎంపీఓ జంగయ్య, డిండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, యాదగిరిరావు, చింతలపూడి భాస్కర్ రెడ్డి, హనుమంతు వెంకటేష్ గౌడ్,, గుర్రం రాములు, కిన్నెర హరికృష్ణ ,మీసాల రామచంద్రయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, మండలంలోని సర్పంచులు కొసిరెడ్డి రాజేందర్ రెడ్డి, కిషన్ నాయక్, మండలంలోని ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఫిజికల్ డైరెక్టర్లు నవనీత ,జ్యోతి, యాదయ్య ,శ్రీనయ్య, ఇద్దయ్య , రంగా నాయక్, బాబు నాయక్ ,రవి నాయక్, తిరుపతయ్య, వి శేఖర్ రెడ్డి ,,రామారావు మరియు మండలంలోని ఉపాధ్యాయులు,క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page