
Telangana Praja Palana Day : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 17, త్రినేత్రం న్యూస్. దేవరకొండ లోని మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రాంగణంలో జాతీయ త్రివర్ణ పతాకాన్ని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి ఆవిష్కరించారు.
అనంతరం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ తెలంగాణ చరిత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంది అన్నారు. తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితులు, స్వేచ్ఛ కోసం సాగిన పోరాటాలు, ఎందరో ప్రజలు చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాటి పోరాట యోధుల త్యాగాలు, ధైర్యసాహసాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే కేంద్రబిందువులని, ప్రజల హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన అన్నారు. చరిత్రను కేవలం పాఠ్యాంశంగా కాకుండా, సమాజ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకునే సాధనంగా విద్యార్థులు అధ్యయనం చేయాలని సూచించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజా ఉద్యమాల గురించి యువత తెలుసుకోవడం ద్వారా తమ ప్రాంతం పట్ల అవగాహనతో పాటు సామాజిక బాధ్యత కూడా పెంపొందుతుందని తెలిపారు.
నేటి విద్యార్థులు భవిష్యత్ సమాజానికి మార్గదర్శకులని, దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రిన్సిపాల్ అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, నిజాయితీ, దేశభక్తి, మానవతా విలువలను అలవరచుకుని సమాజాభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వేచ్ఛా ఫలాలను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ దేశ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణకు కట్టుబడి ఉండాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ జి కోటయ్య, అకాడమిక్ కోఆర్డినేటర్ సి. లింగమయ్య, సి ఓ ఈ జి. లింగారెడ్డి, ఐక్యూ ఏసీ కోఆర్డినేటర్ డా. కె.పృథు, ఎన్సిసి సీటీవో ఆర్.నాగేంద్ర, డాక్టర్ ఎం ప్రభాకర్, డాక్టర్ వి. మకట్లాల్, డాక్టర్ కె .రేణుక, తదితర అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe