
Narendra Modi Birthday Celebrated : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం. పెనుమూరు.(త్రినేత్రం న్యూస్) సెప్టెంబర్ 17. భారత ప్రధాని నరేంద్ర మోడీ 77 వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలో అనేక సేవా కార్యక్రమాలు చేసినట్లు మండల బిజెపి నాయకురాలు గుత్తా ఉషారాణి తెలిపారు. మండలంలోని గుడ్యానంపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆహారం, ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉచితంగా విద్యార్థులకు మందులు పంపిణీ చేశామన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పళ్ళు, రొట్టెలు,అల్పాహారం ప్రధానం చేశామని ఆమె తెలిపారు. అనంతరం ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద వందలాది దీపాలు వెలిగించి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించామని తెలియజేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం విశ్వ గురువుగా రాణించాలని, దీనికి భగవంతుడు నరేంద్ర మోడీకి సకల శక్తిసామర్థ్యాలు అందించాలని ప్రార్థించామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు గుత్తా వాసుదేవ నాయుడు సిహెచ్ డాక్టర్ శ్రీధర్, సూపరిండెంట్ మధులత ఆయుష్ విభాగం డాక్టర్ హరిత తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe