సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Information Commission Imposes Fine

Information Commission Imposes Fine : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 17, త్రినేత్రం న్యూస్. సమాచార హక్కు చట్టం (RTI Act, 2005) నిబంధనలను ఉల్లంఘించి, చట్టబద్ధమైన గడువులోగా సమగ్ర సమాచారం ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించినందుకుగాను నల్గొండ జిల్లా దేవరకొండ మండల విద్యాధికారి( ఎం ఈ ఓ) మాతృ నాయక్‌కు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ₹2,000/- జరిమానా విధించింది. కమిషన్ ఎదుట విచారణకు హాజరైన జిల్లా విద్యాశాఖ అధికారి (డి ఈ ఓ), ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్ జే డీ)లకు కమిషనర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దరఖాస్తుదారుడు కోరిన అన్ని అంశాల పూర్తి సమాచారాన్ని రాబోయే 15 రోజుల్లోగా తప్పనిసరిగా ఉచితంగా అందజేయాలని ఆదేశించారు.
​కేసు నేపథ్యం & అక్రమాల వివరాలు:
రైట్ టు ఇన్ఫర్మేషన్ సర్వీస్ సొసైటీ ( ఆర్ టీ ఐ ఎస్ ఎస్) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కె. బాబురామ్ నాయక్ దేవరకొండ ముదిగొండ రోడ్డులోని శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు, అనుమతులు లేని 9, 10 తరగతుల నిర్వహణ, గతంలో సీజ్ చేసిన ప్రవేశ కేంద్రాన్ని డీ-సీలింగ్ చేసిన వివరాలు, భవన భద్రత, ఫైర్ ఎన్‌ఓసీ, నిబంధనలకు విరుద్ధంగా 100 మీటర్ల పరిధిలోని బార్ & రెస్టారెంట్ తనిఖీ నివేదిక, నలంద ఎడ్యుకేషనల్ సొసైటీ పేరిట గుర్తింపు పొంది శ్రీ చైతన్య పేరుతో నడుపుతున్న బినామీ/ఫ్రాంచైజీ ఒప్పందాలు తదితర 20 కీలక అంశాలపై సెక్షన్ 6(1) కింద దరఖాస్తు దాఖలు చేశారు.
​అయితే, అధికారులు సమాచారాన్ని తొక్కిపెట్టి అరకొర సమాధానాలు ఇవ్వడం, మొదటి అప్పీల్‌పై స్పందించకపోవడంతో బాబురామ్ నాయక్ రాష్ట్ర సమాచార కమిషన్‌లో రెండో అప్పీల్ (కేసు నెం: 1139/SIC-DB/2026) దాఖలు చేశారు.
​కమిషనర్ దేశాల భూపాల్ ఎదుట విచారణ బాధ్యతాయుతమైన ఉన్నతాధికారుల స్థాయిలో ఉండి పాఠశాలల అక్రమాలపై సమగ్ర విచారణ జరపకపోవడం, సమాచార హక్కు చట్టం అమలులో తాత్సారం చేయడంపై డి ఈ ఓ, ఆర్ జే డి లకు కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు.
​సమాచారాన్ని సకాలంలో ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించినందుకు దేవరకొండ ఎం ఈ ఓ మాతృ నాయక్‌కు ₹2,000/- జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అంతేకాకుండా, దరఖాస్తులో కోరిన 20 అంశాల పూర్తి సమాచారాన్ని 15 రోజుల్లోగా పిటిషనర్‌కు ఉచితంగా అందజేయాలని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా ఆదేశాలు అమలు చేయకపోతే బాధ్యులైన అధికారులందరిపై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని కమిషన్ హెచ్చరించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page