
- తీదేడు గ్రామంలో శాంతియుత వాతావరణం,ప్రభుత్వ కార్యాలయాల గౌరవం కాపాడటమే తమ ఉద్దేశం
- బీజేపీ నాయకుల ఫిర్యాదుపై సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి రీ-పిటిషన్
- ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
- తీదేడు గ్రామ సర్పంచ్
No Space Political Party Flex : చింత పల్లి సెప్టెంబర్ 10, త్రినేత్రం న్యూస్. గ్రామంలో శాంతియుత వాతావరణం,ప్రభుత్వ కార్యాలయాల గౌరవం కాపాడటమే తమ ఉద్దేశమని తీదేడు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి అన్నారు.చింతపల్లి మండలం తీదేడు గ్రామపంచాయతీ కార్యాలయ పరిధిలో గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లెక్సీపై బీజేపీ నాయకులు మరో పార్టీకి సంబంధించిన ప్లెక్సీ ఏర్పాటు చేయడంతో గ్రామంలో అనవసరమైన వివాదాలకు,ప్రజల మనోభావాలు దెబ్బతినే పరిస్థితులకు అవకాశం ఏర్పడిందని ఆమె తెలిపారు.
ఈ విషయమై గ్రామపంచాయతీకి ఫిర్యాదు అందడంతో,గ్రామపంచాయతీ కార్యాలయ పరిధిలో ఎలాంటి రాజకీయ పార్టీకి సంబంధించిన ప్లెక్సీలు ఏర్పాటు చేయరాదనే ఉద్దేశంతో గ్రామపంచాయతీ సిబ్బంది ద్వారా సదరు ప్లెక్సీని తొలగించినట్లు ఆమె స్పష్టం చేశారు. ప్లెక్సీ తొలగింపు విషయమై బీజేపీ నాయకులు MPDO, చింతపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గార్లకు ఫిర్యాదు చేయడంపై సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి రీ-పిటిషన్ ద్వారా తన వివరణను సమర్పించారు.గ్రామపంచాయతీ కార్యాలయం అనేది అన్ని పార్టీలకు,అన్ని వర్గాల ప్రజలకు సమానమైన ప్రభుత్వ కార్యాలయమని అక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్లెక్సీలు ఏర్పాటు చేయడం వల్ల అనవసరమైన వివాదాలు తలెత్తే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు.గ్రామంలో శాంతియుత వాతావరణం, ప్రభుత్వ కార్యాలయాల గౌరవం కాపాడటమే తమ ఉద్దేశమని తెలిపారు.
తాను ఎటువంటి రాజకీయ కక్షతోనూ ప్లెక్సీని తొలగించలేదని, గ్రామపంచాయతీ కార్యాలయ పరిధిలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్లెక్సీలు ఉండకూడదనే సాధారణ నిబంధనను అందరికీ సమానంగా వర్తింపజేసే ఉద్దేశంతోనే చర్య తీసుకున్నామని ఆమె స్పష్టం చేశారు.కావున ఈ విషయాన్ని సమగ్రంగా పరిశీలించి,వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని బీజేపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదును పునఃపరిశీలించాలని యం.పి.డి.ఓ కార్యాలయంలో చింతపల్లి సబ్ ఇన్స్పెక్టర్ గార్లను ఆమె కోరారు.ఈ కార్యక్రమంలో పాలక వర్గం సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్,గంటెల అలివేలు సోమయ్య,దాసరి కళమ్మ ముత్తయ్య,రెడ్డి పద్మ పరమేష్ ముదిరాజ్,శివర్ల పర్వతాలు యాదవ్,గ్రామస్తులు మర్రు రామారావు, సిమర్ల శ్రీను యాదవ్, దాసరి తిరుపతయ్య, వీరమల్ల వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe