
Road Safety : చింతపల్లి సెప్టెంబర్ 03, త్రినేత్రం న్యూస్. రోడ్డు ప్రమాదాలు నివారణకు పాటు వాహనదారులు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వెల్లంకి ఫుడ్స్ అధినేత వెల్లంకి శంకర్రావు తన ఆర్థిక సహకారంతో దేవరకొండ పోలీస్ శాఖకు 40 రోడ్డు భద్రత బారీ కేడ్లను అందజేశారు. చింతపల్లి మండలం తీడేడు గేటు వద్ద ఉన్న వెల్లంకి ఫుడ్స్ వ్యవసాయ క్షేత్రంలో గురువారం నాడు నిర్వహించిన కార్యక్రమంలో బారీ కెడ్లను పోలీస్ శాఖకు అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ బారికేడ్లను పరిశీలించి ప్రజల భద్రత కోసం ముందుకు వచ్చి సహకరించిన వెల్లంకి శంకరావును అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ హైదరాబాద్ నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై ప్రధాన రహదారిపై రాకపోకలు అధికంగా ఉంటాయని తెలిపారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో బారీ కేడ్లను ఏర్పాటు చేయడం ద్వారా వాహనాల వేగాన్ని మెరుగుపరచవచ్చని అన్నారు. వెల్లంకి శంకర్రావు సేవాభావాన్ని ఎమ్మెల్యేతో పాటు పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ డిఎస్పి కొండమల్లేపల్లి సిఐ దేవరకొండ సిఐ కొండమల్లేపల్లి ఎస్సై మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు సంజీవరెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జటావత్ హరి, మాజీ ఎంపీపీ కొండురు పవన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరుకుల వెంకటయ్య గౌడ్, మాజీ మండల అధ్యక్షుడు అంగిరేకుల నాగభూషణం జితేందర్ రెడ్డి దాసరి శ్రీనివాస్ యాదవ్ చందంపేట మండల అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ వీ పి ఓ విజయ్ కార్యదర్శి కిరణ్ కుమార్ చంద్రశేఖర్ కాసారపు శ్రీను గుణమోనికొండల్ నరసింహారెడ్డి నవీన్ రామావత్ హనుమ నాయక్ బగ్గు చివర్న శంకర్ యాదవ్ గుణమోని శ్రీనివాస్ ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe