
Substantial Loans Sanctioned : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్: సెప్టెంబర్ 03; భీమడోలు లో రైతు సేవా సహకార సంఘం అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో భాగంగా 133 మంది రైతులకు రూపాయలు 1.30 కోట్ల రుణాలు మంజూరు చేశారు. అయితే ఇటీవల పదవి విరమణ చేసిన ఉద్యోగులకు హెచ్ ఆర్ పాలసీ ప్రకారం రిటైర్మెంట్ ప్రయోజనాలు కూడా ఆమోదించారు.
ఆ సొసైటీ సీఈవో నాగేంద్ర మాట్లాడుతూ, గతంలో కంటే రుణాల మంజూరు 50 % పెరిగిందని, రికవరీ 92% ఉందని తెలిపారు. ఈ సమావేశంలో వెజ్జు రాంబాబు, గేదెల శ్రీనివాసు, భీమడోలు డీ సీ సీ బి మేనేజర్ సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe