సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Kanchi Mahendar

Kanchi Mahendar : కూకట్పల్లి సెప్టెంబర్ 2 (త్రినేత్రం న్యూస్) : మల్కాజ్‌గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ఫతేనగర్‌లో పర్యటించి స్థానిక సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు కాంచి మహేందర్ ఫతేనగర్ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.ప్రధానంగా ఫతేనగర్‌లోని బ్రిడ్జి సమస్యపై కాంచి మహేందర్ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్‌కు వివరించారు. వంతెన దెబ్బతినడంతో స్థానిక ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. సమస్యపై స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్ త్వరలోనే సంబంధిత అధికారులతో సమన్వయం చేసి వంతెన నిర్మాణానికి అవసరమైన చర్యలు చేపడతామని, భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంతరం ఎంపీ ఈటల రాజేందర్, కాంచి మహేందర్‌తో కలిసి పాత ఎయిర్‌పోర్ట్ ప్రాంతంలోని శ్మశానవాటికను సందర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన అభివృద్ధి పనులు ఇప్పటికీ పూర్తికాకపోవడంతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంచి మహేందర్ ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుత ప్రభుత్వం కూడా సమస్య పరిష్కారంపై తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆయన పేర్కొన్నారు.శ్మశానవాటిక సమస్యపై స్పందించిన ఎంపీ ఈటల రాజేందర్ సంబంధిత అధికారులతో మాట్లాడి, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ పర్యటనలో బీజేపీ సీనియర్ నాయకులు, ఫతేనగర్ డివిజన్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page