
Birthday Celebrations Pawan Kalyan : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 02 ; టీ. నర్సాపురం మండలంలో ఘనంగా ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా పోలవరం నియోజకవర్గం మొత్తం నిర్వహించారు. ఇందులో భాగంగా జీలుగుమిల్లి నుంచి టీ నర్సాపురం వరకు నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ విజయవంతమైంది. టీ. నర్సాపురం మండలంలో పోలవరం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు నేతృత్వంలో నిర్వహించినటువంటి ఈ ర్యాలీలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విశేష స్పందన తెలిపారు.
ముందుగా అప్పలరాజు గూడెం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం బండివారిగూడెం గ్రామంలో కేక్ కట్ చేసి, గ్రామస్తుల తరఫున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీగా టీ. నర్సాపురం చేరుకున్న ఆయన ఎస్.ఎస్. కల్యాణ మండపం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించా రు. సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్ చేసి పవన్ కళ్యాణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ కేక్‌ను పార్టీ నాయకులు, జనసైనికులు, అభిమానులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం జనసేన నాయకులు బండారు అనిల్, జట్ల సత్యనారాయణ, చింతలపూడి నవీన్, తొమ్మిదేళ్ల శ్రీనివాస్, పూనెం రాజా, సింగలూరు ఏసుబాబు, కరాటం సతీష్, కిరణ్, మారిశెట్టి సాయి, మంత్రి గోపాలకృష్ణ, కోటి, మేచినేని సంజయ్, రూప సత్యనారాయణ, పింగుల మధు, సిరిబత్తుల స్వామి, సొంటి రామకృష్ణ, మందపాటి సూర్యచంద్రం, కొప్పుల శ్రీకాంత్, కంపసాటి రమేష్, నారాయణరావు కుంజ రమేష్, దేవుడు శ్రీనివాస్, రాయ్ సుబ్బారావు, నేలటూరి మోహన్ కూటమి నాయకులు,, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe