
–కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలి.
—కార్మికుల హక్కుల కోసం సమరశీల పోరాటాలు చేసేది ఏఐటీయూసీ… నూనె వెంకటేశ్వర్లు.
AITUC Conference : డిండి (గుండ్లపల్లి) సెప్టెంబర్ 01, త్రినేత్రం న్యూస్. కరీంనగర్ లోసెప్టెంబర్ 6 ,7 ,8 తేదీలలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు కార్మికులకు పిలుపునిచ్చారు.
కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టడం కోసం కరీంనగర్ లో జరుగుతున్న ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభలలో చర్చించి కార్మికులంతా ఐక్యమై పోరాటాల నిర్వహించాలని ,మన హక్కులను కాపాడుకోవాలని, నాటి నుండి భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడిన సంఘం ఏఐటియుసి అన్నారు.
స్వాతంత్రానికి పూర్వమే కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన సంఘం కార్మికుల కోసం కనీస వేతనం ఇవ్వాలని ,PF,ESI సౌకర్యాలు కల్పించాలని ,సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ,కార్మికులపై ప్రభుత్వాలు చూపుతున్న సవితి తల్లి ప్రేమను వీడాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహాసభకు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయలని కోరారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాగిళ్ల సహదేవ్, ఏనుక సత్తయ్య , డి.ఆంజనేయులు, A వెంకటేష్ ,కొప్పుల నాగేష్, కరంటు నార్య ,గోరటి ఇద్దయ్య,Mవెంకటయ్య ,నూనె దేవయ్య ,గోరటి సైదులు ,కే రమేష్ ,ఎం శ్రీను, ఏనుక అంజయ్య ,ఎం వెంకటయ్య పి జంప్ల మస్తాన్, బక్కయ్య తదిరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe