సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Uniforms must provided students

– బీఆర్‌ఎస్‌వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ

Uniforms must Provided Students : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 01, త్రినేత్రం న్యూస్. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తక్షణమే యూనిఫామ్స్ అందించాలని బీఆర్‌ఎస్‌వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మంగళవారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ…..విద్యా సంవత్సరం ప్రారంభమై నేటికి నాలుగు నెలలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటివరకు యూనిఫామ్స్ అందించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికినిదర్శనమన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారని, వారికి అవసరమైన యూనిఫామ్స్‌ను సకాలంలో అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు యూనిఫామ్స్ అందించాల్సి ఉండగా, నాలుగు నెలలు గడిచినా వాటి పంపిణీ జరగకపోవడం బాధాకరమన్నారు.

దీనివల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యార్థుల సమస్యల పరిష్కారం విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బొడ్డుపల్లి కృష్ణ విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థులందరికీ వెంటనే యూనిఫామ్స్ అందించాలని, విద్యార్థుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page