సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Ravindra Kumar

రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందాలి… దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

Ravindra Kumar : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 01, త్రినేత్రం న్యూస్. ప్రతి ఒక్కరూ రేణుక ఎల్లమ్మ తల్లి అనుగ్రహం పొందాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని 18వ వార్డులో నిర్వహించిన రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల పండుగ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు, భక్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…..రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచి, ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవాలని సూచించారు.బోనాల పండుగ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు టీ వీ ఎన్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ విరమోని అంజి గౌడ్,కేతవత్ రుప్లా నాయక్,బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ తులిసీరామ్, వడత్య బాలు,కేతవత్ హరిలాల్,అంబటి లోకేష్,బొడ్డుపల్లి వెంకటయ్య,విజయ్,ఇస్తారి,అంజి,జేపాల్,నాగార్జున, స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page