ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Wind Power Projects

ఏర్పాట్లు చేయనున్న సుజ్లాన్ సంస్థ

నేడు మంత్రి లోకేష్ చేతుల మీదుగా నేడు కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లకు శ్రీకారం

Wind Power Projects : త్రినేత్రం న్యూస్ : సుజ్లాన్ సంస్థ అనంతపురం జిల్లా రాయదుర్గంలో రూ.10 వేల కోట్ల వ్యయంతో 1,325 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా ప్రత్యక్ష, పరోక్షంగా 4 వేల మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ ప్రాజెక్టులో భాగంగా కనేకల్లు మండలం హులికెర గ్రామంలో సుజ్లాన్ సంస్థకు చెందిన ఎస్ 144 కొత్త బ్లేడ్ ఉత్పత్తి లైన్లను మంత్రి లోకేష్ మంగళవారం ప్రారంభిస్తారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
‘ఈ సంస్థ 1,700 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో రాష్ట్రంలో అతిపెద్ద పవన విద్యుత్ భాగస్వామిగా ఉంది. ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలం ఇప్పూరులో రోటర్ బ్లేడ్ తయారీ యూనిట్ను సంస్థ నిర్వహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, సుజ్లాన్ సంయుక్తంగా దేశంలోనే అతిపెద్ద గ్రీన్ స్కూల్ డెవలప్మెంట్ ప్రాజెక్టును నిర్వహిస్తున్నాయి. ఉరవకొండ, విజయవాడల్లో ప్రపంచ స్థాయి విండ్ ఎనర్జీ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేసి 12 వేల మంది యువతకు శిక్షణను ఇస్తున్నాయి. ప్రపంచ

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page