ఆగస్ట్ 23, 2026
TRINETHRAM NEWS
Dr. RS Praveen Kumar

Dr. RS Praveen Kumar : దేవరకొండ డివిజన్ ఆగష్టు 23, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లోని కొండ మల్లేపల్లి లో ఇటీవల మృతి చెందిన నాగార్జున స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపల్ రూప రెడ్డి కుటుంబ సభ్యులను ఆదివారం రోజు హైదరాబాద్, గుర్రంగూడ లోని నివాసాంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ హత్యకు గల కారణాలను తెలుసుకున్నారు.

అనంతరం ఆర్ఎస్పి మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలలు ఎంత దారుణంగా దిగజారాయో అని ఇలాంటి సంఘటనను చూస్తే అర్థమవుతుంది విద్యార్థులను మంచి మార్గంలో నడిపించడానికి ప్రతి స్కూల్లో ఒక కౌన్సిలర్ నియమించాలని అదేవిధంగా తల్లిదండ్రులకు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ, విద్యార్థుల నడవడికను గమనిస్తూ ఎప్పటికప్పుడు వారి ప్రవర్తన మీద దృష్టి పెట్టాలని సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి వాటికి తావునీయకుండ, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని అన్నారు.

అనంతరం రూపరెడ్డి చిత్రపటానికి నివాళ్లు అర్పించారు.ఆయన వెంట బిఆర్ఎస్ నాయకులు రామావత్ రమేష్ నాయక్, నాయిని శ్రావణ్ రెడ్డి, చనగొని శివ గౌడ్, తుర్కయంజాల్ కౌన్సిలర్ రామావత్ కళ్యాణ్ నాయక్, బండ రావిరాళ్ల సర్పంచ్ కందికంటి విజయ్ కుమార్, అనాజ్ పూర్ సర్పంచ్ ముదిగొండ మొగులయ్య, కేశవులుఅందొజు శంకరాచారి,మల్లారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ భాస్కర్,గంటేల ఆంజనేయులు,గండు నాగేంద్రబాబు,ముదిగొండ వెంకట్,అశోక్ నాయక్,శ్రీను, శివ,అడ్వకేట్ మాతంగి సురేష్, పల్లె అనిల్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page