
Environmental Protection : అరకులోయ ఆగస్టు 23,( త్రినేత్రం న్యూస్): ఆరోగ్యకరమైన జీవనానికి పరిసరాల పరిశుభ్రత ఎంతో దోహదం చేస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి జి. వీరపాండ్యన్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల మూడో శనివారం నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ టి. నిషాంతి, జాయింట్ కలెక్టర్ తిరుమాని శ్రీపూజ, పాడేరు ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మతో కలిసి పీహెచ్‌సీ ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం అధికారులు, ఉద్యోగులతో పరిశుభ్రత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా వీరపాండ్యన్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.ప్లాస్టిక్ వ్యర్థాలను ఇతర చెత్తతో కలపకుండా వేరు చేసి, నిర్దేశిత విధానంలో పారవేయాలని తెలిపారు. పరిశుభ్రమైన వాతావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
పీహెచ్‌సీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో చొరవ చూపుతున్న స్థానిక పంచాయతీ సిబ్బందిని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పరిశుభ్రతను ఒకరోజు కార్యక్రమంగా కాకుండా నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో ఏపీఎస్‌ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్ సియ్యాది దొన్నుదొర, గ్రామ స్వర్ణాలయాల నోడల్ అధికారి పి.ఎస్.కుమార్, జిల్లా, మండల అధికారులు, ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe