సెప్టెంబర్ 15, 2026
TRINETHRAM NEWS
TRUSMA

TRUSMA : కూకట్పల్లి ఆగస్టు 22 (త్రినేత్రం న్యూస్) : విద్యార్థి చేతిలో దారుణంగా హత్య గురైన రూపా రెడ్డి కుటుంబాన్ని తెలంగాణ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల సంఘం ( ట్రస్మా) ప్రతినిధులు పరామర్శించారు. తురక యంజాల్ లోని తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు ఎస్ ఎన్ రెడ్డి మాట్లాడుతూ ఓ ప్రధానోపాధ్యాయురాలు విద్యార్థుల దాడిలో మృతి చెందడం విచారకరమన్నారు.

విద్యార్థులను సన్మార్గంలో నడిపించడంలో ప్రస్తుత సమాజంలోని అందరూ విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. క్రమశిక్షణ నేర్పించడంలో అటు తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్లనే వారు చెడు మార్గాల్లో ప్రయాణిస్తున్నారని ఆందోళన చెందారు. ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా ప్రభావం వల్ల విద్యార్థుల్లో పెడ ధోరణులు, విపరీత ధోరణులు రోజుకు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు.

తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు సహకరించినట్లయితే పిల్లల్ని చిన్నతనం నుంచే సన్మార్గంలో నడిపించే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ తల్లిదండ్రుల అతి గారాభం వల్ల అది సాధ్యపడటం లేదన్నారు. గంజాయి మత్తు పదార్థాల నివారించడంలో ప్రభుత్వ యంత్రాంగం పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రస్తుత రోజుల్లో గంజాయి డ్రగ్స్ విచ్చలవిడిగా మార్కెట్లో దొరుకుతుందని వాటికి బానిసై పిల్లలు పాడవుతున్నారని ఆవేదన చెందారు. కార్యక్రమం లో ట్రస్మా రాష్ట్ర కోశాధికారి ..కె.శ్రీకాంత్ రెడ్డి, నాయకులు రాణి, వి.సుదర్శన్ రెడ్డి, రామకృష్ణ లతో పాటు… కొండా మల్లేపల్లి ట్రస్మా సభ్యులు, నల్గొండ ట్రస్మా సభ్యులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page