ఆగస్ట్ 23, 2026
TRINETHRAM NEWS
Young Woman Missing

Young Woman Missing : అరకులోయ ఆగస్టు 23, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం సిరగం పంచాయతీ పరిధిలోని దిబ్బవలస గ్రామానికి చెందిన కేసు సోడపల్లి మేరీ (21) తప్పిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మేరీ శుక్రవారం సంతకు వెళ్తున్నానని చెప్పి ఉదయం సుమారు 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లింది. అయితే రోజంతా గడిచినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించారు. అయినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు.
దీంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులను ఆశ్రయించి మేరీ తప్పిపోయినట్లు ఫిర్యాదు చేశారు. ఇటీవలే మేరీ డీఎంఎల్టీ కోర్సు పూర్తి చేసి ఇంటికి వచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె వయస్సు సుమారు 21 సంవత్సరాలు, ఎత్తు సుమారు 4.5 అడుగులు ఉంటుందని పేర్కొన్నారు.
మేరీ ఆచూకీ తెలిసిన వారు, ఎక్కడైనా ఆమెను గుర్తించిన వారు వెంటనే కుటుంబ సభ్యులకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.
సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్లు:
📞 9441993416
📞 7815960715

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page