ఆగస్ట్ 18, 2026
TRINETHRAM NEWS
Teej

Teej : డిండి(గుండ్ల పల్లి)ఆగష్టు 17, త్రినేత్రం న్యూస్. గిరిజన ఆచారాలు సంప్రదాయాలకు ప్రతీకగా పిలువబడే తీజ్ పండుగను మండల పరిధిలోని నగర దుబ్బ తండా గ్రామ పంచాయతీ లో బంజారాల సంప్రదాయ తీజ్ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తీజ్ పండుగ సందర్భంగా తండా అంతా పండుగ శోభను సంతరించుకుంది. మహిళలు,యువతులు సంప్రదాయ బంజారా వస్త్రధారణలో ముస్తాబై ప్రత్యేకంగా అలంకరించిన తీజ్ బుట్టలతో వేడుకల్లో పాల్గొన్నారు.

తీజ్ బుట్టలను పూజించి, మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ,డిజె పాటల తో నృత్యాలు చేస్తూ సందడి చేశారు.డప్పుల మోత, బంజారా పాటలతో తండాలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. చిన్నారులు,యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా తండా పెద్దలు మాట్లాడుతూ.. తీజ్ పండుగ బంజారా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. తరతరాలుగా వస్తున్న ఆచారాలను కొనసాగిస్తూ యువతకు బంజారా సంస్కృతి,సంప్రదాయాలపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి వేడుకలు ఎంతో దోహదపడతాయని అన్నారు.ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.తీజ్ వేడుకల్లో తండా ప్రజలు ఉత్సాహంగా పాల్గొని తీజ్ బుట్టలను సమీపంలోని చెరువులో నిమ్మజ్జనం చేసి పండుగను విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page