ఆగస్ట్ 17, 2026
TRINETHRAM NEWS
Praja Vani

ఎం పి డీ ఓ :–నర్రావేజన.

Praja Vani : డిండి( గుండ్ల పల్లి) ఆగష్టు 17, త్రినేత్రం న్యూస్. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుందని ఎంపీడీవో నర్రా వేజన అన్నారు. సోమవారం డిండి మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజావాణికి మొత్తం 8 దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని అన్నారు. సంబంధిత శాఖల అధికారులు ప్రజల నుంచి వినతులను స్వీకరించి తమ పరిధిలోని సమస్యలను పరిశీలించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్ గౌడ్, మండలంలోని వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page