సెప్టెంబర్ 6, 2026
TRINETHRAM NEWS
Social Justice

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రాతిపదికన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలి

Social Justice : త్రినేత్రం న్యూస్, రాజమహేంద్రవరం, ఆగస్టు 17: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు జనాభా ప్రాతిపదికన సముచిత రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు కోరారు.
సోమవారం జిల్లా కలెక్టర్‌ను కలిసి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య ఇచ్చిన లేఖను ఆమెకు అందజేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ మండలాన్ని యూనిట్‌గా తీసుకుని రిజర్వేషన్లు నిర్ణయించడం వల్ల కొన్ని ప్రాంతాల్లో సామాజిక వర్గాల జనాభాకు, వారికి లభిస్తున్న రాజకీయ ప్రాతినిధ్యానికి మధ్య వ్యత్యాసం ఏర్పడుతోందన్నారు.
రాష్ట్రాన్ని ఒక సమగ్ర యూనిట్‌గా పరిగణించి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా నిష్పత్తికి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. బీసీల్లోని 139 కులాలకు సమాన రాజకీయ అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వేషన్ రొటేషన్ విధానం వల్ల కొన్ని కులాలకే పదేపదే అవకాశాలు లభించకుండా, చిన్న మరియు అత్యంత వెనుకబడిన కులాలకు కూడా తగిన ప్రాతినిధ్యం కల్పించాలని తాటిపాక మధు విజ్ఞప్తి చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page