ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
MLA consoles family

-బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి..

MLA Consoles Family : కొండ మల్లేపల్లి ఆగష్టు 12, త్రినేత్రం న్యూస్. కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన నాగార్జున స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపల్ కళ్లూరూప రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ దేవరకొండ ఆసుపత్రికి చేరుకొని ఆమె భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ మాట్లాడుతూ.. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను వెలికితీసి, ఘటనకు బాధ్యులైన వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కొండమల్లేపల్లి సీఐని ఆదేశించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయని జమున మాధవరెడ్డి, నల్లగొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ ఎంఏ సిరాజ్ ఖాన్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్కూరి వేమన్ రెడ్డి, చందంపేట మాజీ ఎంపీపీ ఏడుపుల గోవిందు యాదవ్, మండల అధ్యక్షుడు దొండేటి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ కోతి యుగంధర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, కౌన్సిలర్ శ్రీధర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోట్ల జగదీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page