ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
efforts of BLAs

దేవరకొండ మాజీ శాసనసభ్యులు :– రమావత్ రవీంద్ర కుమార్.

Efforts of BLAs : దేవరకొండ డివిజన్ ఆగష్టు 11, త్రినేత్రం న్యూస్. ఎస్.ఐ.ఆర్. (SIR) ప్రక్రియ విజయవంతంగా ముగియడంలో బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) అందించిన సేవలు, చూపిన నిబద్ధత అభినందనీయమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరిస్తూ, అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడటంతో పాటు అనర్హులైన ఓటర్లను గుర్తించే ప్రక్రియలో BLAలు చూపిన నిబద్ధత, పట్టుదల, బాధ్యత ప్రశంసనీయమన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు హక్కు అత్యంత కీలకమని, ప్రతి అర్హుడైన పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు ఓటర్ల జాబితాలో ఉన్న తప్పులు, అనర్హుల వివరాలను గుర్తించడం వంటి ప్రక్రియలో BLAలు కీలక పాత్ర పోషించారని తెలిపారు.

ఎండ, వానలను లెక్కచేయకుండా ప్రజల వద్దకు వెళ్లి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించిన ప్రతి BLAకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో పనిచేయాలని రమావత్ రవీంద్ర కుమార్ ఆకాంక్షించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page