ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Death Poola Sattaiah

ఉలుపాల శేఖర్ రెడ్డిబీఆర్‌ఎస్ పార్టీ నాయకులు

Death Poola Sattaiah : చింతపల్లి ఆగస్టు 11, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలం తీదేడు గ్రామానికి చెందిన పూల సత్తయ్య మృతి చెందడం అత్యంత బాధాకరమని గ్రామ మాజీ ఉప సర్పంచ్,బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి అన్నారు.మంగళవారం.. సత్తయ్య మృతదేహానికి పూల మాల వేసి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.సత్తయ్య మృతి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు తీరని లోటని పేర్కొన్నారు.

ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోనగంటి గోవర్ధనాచారి,నాయకులు మర్రు రామారావు,జూలురు శ్రీధర్,ఉలుపాల పురుషోత్తం రెడ్డి,సిమర్ల శ్రీను యాదవ్, దాసరి ముత్తయ్య, రెడ్డి పరమేష్,మునగాల అశోక్,కలగోని కిరణ్, తదితరులున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page