
— వృద్ధాప్య పింఛన్లు ఇవ్వని ప్రభుత్వం గద్దె దిగాలి.
సోనగంటి గోవర్ధనాచారి… తీదేడు గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు
Pensions Must be Sanctioned : చింత పల్లి ఆగష్టు 11, త్రినేత్రం న్యూస్. అర్హులైన వృద్ధులకు వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని తీదేడు గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సోనగంటి గోవర్ధనాచారి అన్నారు. వృద్ధులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
గ్రామాల్లో ఎంతోమంది వృద్ధులు పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారని, వయస్సు మీదపడిన వారికి పింఛన్ ఎంతో ఆసరాగా ఉంటుందని తెలిపారు.అర్హత ఉన్న ప్రతి వృద్ధుడికి ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.వృద్ధులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోవాలని అన్నారు.
పింఛన్ల విషయంలో ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉలుపాల శేఖర్ రెడ్డి,మర్రు రామారావు,ఉలుపాల పురుషోత్తం రెడ్డి, సిమర్ల శ్రీను యాదవ్, జూలురు శ్రీధర్,దాసరి ముత్తయ్య,రెడ్డి పరమేష్,మునగాల అశోక్,పంబాల చంద్రయ్య,కలగోని కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe