
Tribal Association : అరకులోయ, ఆగస్టు 6, (త్రినేత్రం న్యూస్): ఆదివాసులకు 100 శాతం రిజర్వేషన్ అమలు, 1/70 చట్టం పరిరక్షణతో పాటు గిరిజనుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఎస్టీ కమిషన్ జోక్యం చేసుకోవాలని ఆదివాసీ గిరిజన సంఘం ప్రతినిధి బృందం కోరింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోల్ల బొజ్జిరెడ్డి, సభ్యులకు జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ నేతృత్వంలో వినతిపత్రం అందజేశారు.
వినతిపత్రంలో 100 శాతం గిరిజన రిజర్వేషన్‌కు ప్రత్యేక చట్టం తీసుకురావడం, 1/70 చట్టాన్ని పరిరక్షించడం, గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు గిరిజనులతోనే భర్తీ చేయడం, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన జీఓలు 51, 29, 13, 2లను రద్దు చేయాలని కోరారు. అలాగే పీఎం జనమన్ గృహాల బకాయిలు, అదనపు సాయం విడుదల, ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీ, కొత్తగా దరఖాస్తు చేసిన పోడు రైతులకు పట్టాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఆదివాసి ఉద్యమాలపై అక్రమ కేసులు నమోదు చేసి నాయకులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మహిళలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ, ఈ అంశంపై కూడా ఎస్టీ కమిషన్ తక్షణమే జోక్యం చేసుకుని చర్యలు తీసుకోవాలని సంఘం కోరింది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe