
INTUC President Meets New CI : కూకట్పల్లి జులై 25 (త్రినేత్రం న్యూస్) : కూకట్పల్లి నూతన సీఐగా ఇటీవల పదవి భాద్యతలు చేపట్టిన డి.స్వామి గౌడ్, కూకట్పల్లి నియోజకవర్గం ఐ.ఎన్.టి.యు.సి అధ్యక్షులు కర్కనాగరాజు మర్యాదపూర్వకంగా వారిని కలిసి శాలువాతో సత్కరించి ఫూల మొక్కతో మరియు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా.బి ఆర్.అంబేద్కర్ చిత్రపటాన్ని ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం వారు మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఇన్స్పెక్టర్ స్వామి గౌడ్ ఈ సందర్బంగా కోరారు. కర్క నాగరాజు మాట్లాడుతూ కొత్త సి.ఐ అంకితభావంతో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలను పరిరక్షించడం లో నిబద్ధతో కూకట్పల్లి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఐ.ఎన్.టి.యు.సి నాయకులు జక్కుల అశోక్, ఐ సి డి కంటైనర్ యూనియన్ నాయకులు జగన్, కర్క మహేష్,రమేష్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe