ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Congress condemns attack

Congress Condemns Attack : అల్లూరిజిల్లా అరకులోయ,జూలై 25, (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ఆంధ్రరత్న భవన్‌పై బిజెపి నాయకులు ముకుమ్మడిగా దాడి చేయడంపై తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతకుమారి డిమాండ్ చేశారు. శనివారం అరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ఈ ఘటన ప్రజాస్వామ్య విలువలపై జరిగిన దాడి అని పేర్కొన్నారు.
దాడిలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తేజతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు గాయపడడం బాధాకరమని తెలిపారు. ఘటనపై నిష్పాక్షిక విచారణ జరిపి, దాడికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గవర్నర్, డీజీపీని కోరారు. ఈ సమావేశంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు, పీసీసీ డెలిగేట్ పాచిపెంట చిన్నస్వామి, జిల్లా అధ్యక్షుడు పాంగి గంగాధర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page