
Ramavath Ravindra Kumar : దేవరకొండ డివిజన్ జులై 18, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎస్ కే. మైబెల్లి ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో శనివారం దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ఆయనను స్వగృహంలో పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆర్థిక సహాయం అందజేసి, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. “పార్టీ కార్యకర్తల సంక్షేమమే మా ప్రాధాన్యత. కష్టకాలంలో ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు టీ వీ ఎన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్, పార్టీ నాయకులు బొడ్డు గోపాల్ గౌడ్, ఉజ్జిని విద్యాసాగర్ రావు, వాజిద్ పాషా, బొడ్డుపల్లి కృష్ణ, పొట్ట మధు, ఇలియాస్ పటేల్, జమీర్ బాబా, ముదిగొండ హరిదాస్, అఫ్రోజ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe