
–విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ నిర్వహణలో పూర్తిగా విఫలం
-పాఠశాలలు తెరచి నెల రోజులు దాటినా కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు పూర్తిస్థాయిలో అందకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం.
–బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ
Boddupalli Krishna : దేవరకొండ డివిజన్ జులై 14.త్రినేత్రం న్యూస్. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ నిర్వహణలో పూర్తిగా విఫలమయ్యారని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు.దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ….పాఠశాలలు తెరచి నెల రోజులు దాటినా కూడా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇప్పటికీ పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు పూర్తిస్థాయిలో అందకపోవడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఆయన అన్నారు.విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
విద్యాశాఖను తన వద్దే ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సింది పోయి, వాటిని నిర్వీర్యం చేసే విధంగా పాలన సాగుతోంది అని ఆయన అన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు, ఇతర అవసరమైన సౌకర్యాలను తక్షణమే అందించాలి. విద్యారంగ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి,వీ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గం తరఫున డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe