ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Bandh educational institutions

–తక్షణమే విద్య హక్కు చట్టం అమలు చేయాలి.

ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల బోర్డు ఏర్పాటు చేయాలి.

–పెండింగ్ లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.

దేవరకొండ డివిజన్ జులై 10, త్రినేత్రం న్యూస్.

Bandh Educational Institutions : తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని జూలై 10వ తేదీన విద్యార్థి వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ పిలుపులో భాగంగా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రైవేట్ గవర్నమెంట్ పాఠశాలలు కళాశాలలను పూర్తిస్థాయి సంపూర్ణంగా బంద్ నిర్వహించడం. జరిగింది కేంద్ర కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీవో కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈసందర్భంగా ఎస్ఎఫ్ఐ,ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి బుడిగ వెంకటేష్ వట్టేపు శివ….

మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ పాఠశాలను 4వేలకు కుదించాలని రాష్ట్రప్రభుత్వం ఆలోచనను మానుకోవాలని విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని ఇప్పటివరకు కేటాయించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి అలసత్వం వహించడం విద్యాశాఖ అని నిర్వీర్యం చేసే ఆలోచనలో భాగమే అని వారు ఆరోపించారు,తక్షణమే విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలని అదేవిధంగా మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి అక్షయపాత్ర ఇస్కాన్ మన సంస్థను కాకుండా మహిళా సంఘాలకు కేటాయించాలని వారు కోరారు, ఖాళీగా ఉన్న టీచరు ఎంఈఓ డిఈఓ లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచి పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ 250 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఈ పి 2020 తెలంగాణ రాష్ట్రం అమలు చేయకుండా అసెంబ్లీలో వెంటనే తీర్మానం చేయాలని, రాష్ట్రంలో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని ఎప్పటినుంచి ఉన్నటువంటి డిమాండ్ ను ఇప్పుడున్న ప్రభుత్వం తక్షణమే అమలు చేసే విధంగా ఆలోచన చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థలను అభివృద్ధి చెందే విధంగా కృషి చేయాలని వారు కోరారు.

బడ్జెట్ పాఠశాలకు ప్రభుత్వం సహకరించాలని ప్రైవేట్ పాఠశాలలను కేటగిరీలు విభజించి ఫీజులు నిర్ణయించాలని రాష్ట్రంలో గత ఆరు సంవత్సరాల నుంచి స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ సుమారు 10,500 కోట్ల పైగా నిధులు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఈ నిధులు విడుదల చేయకపోవడం వలన లక్షల మంది ప్రైవేటు డిగ్రీ పీజీ మరియు ఇంజనీరింగ్ ఇతర ప్రొఫెషనల్ కోర్సులలో చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జీతాలు చెల్లించలేని పరిస్థితిలో విద్యాసంస్థలు యాజమాన్యాలు ఉన్నాయని వాటిని పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 7 8 9 తీసుకువచ్చి ఉపకార వేతనాలను పథకాన్ని ఎత్తివేయాలి అనుకుంటున్నారని దీని ఉపసంహరించికోవాలని చెప్పి ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.

విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన బంద్ సంపూర్ణంగా విజయవంతమైందని భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ఈ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమ కార్యచరణ నిర్వహించి ముందుకు వెళ్లడంలో వెనకకు పోమని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు సభవత్ వినోద్,అంకూరి ప్రణయ్,దుళ్ల కార్తీక్,బత్తుల శివ, పులిజాల శివ,గణేష్, అంజి,జెటమోని సతీష్, పల్లె చైతన్య, దాసరి శివ, నాయకులు దర్శనం సతీష్,ఎం నితిన్, తదితరులు పాల్గొన్నారుతదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page