జూలై 14, 2026
TRINETHRAM NEWS
villages suffer

Villages Suffer : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం.పెనుమూరు (జులై 9).మండలంలోని చింతపెంట పంచాయతీ పరిధిలో గల 5జి మ్యాంగో ఫ్యాక్టరి వదిలే వ్యర్థాలతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఫ్యాక్టరీ నుండి వచ్చే వ్యర్థాలను నేరుగా కాలువ ద్వారా పోలవరం చెరువులోకి వదిలిపెడుతున్నారు. ఈ చెరువు చుట్టుపక్కల తూరుప్పల్లి, చిన్ననడింపల్లి, బండకిందపల్లి, పోలవరం గ్రామాలు వున్నాయి. ఆ గ్రామాల రైతులు సాగునీరు కోసం ఏర్పాటు చేసుకున్న బావులలోకి ఈ కలుషిత మైన నీరు వెళ్ళుతుండడంతో, రసాయనాలు కలిసిన కలుషిత నీటిని రైతులు తమ పంటలకు వాడడంతో, ఆ పంటలు వెంటనే చచ్చిపోతున్నాయి.

ఆ నీరు బావులలో ఊరుతుండడంతో బావులలో కూడా నీరు రంగు మారిపోతుంది. అలాగే వ్యవసాయ బోర్లలో కూడా ఈ కలుషిత నీరు వస్తుండడం ఈ నీటిని మామిడిచెట్లకు పెట్టిన వెంటనే పలు మామిడి చెట్లు చనిపోయాయని, తూరుప్పల్లి గ్రామానికి చెందిన రైతు కిషోర్ రెడ్డి వాపోయారు. చుట్టుపక్కల గ్రామాలు తాగునీటి కోసం ఏర్పాటు చేసుకున్న బోర్లలో కూడా ఈ కలుషిత నీరు కలిసిపోయి ఉండడంతో చాలామంది ప్రజలు వ్యాధుల భారినపడుతున్నారు. ఈ ఫ్యాక్టరీకి వచ్చిన మామిడి కాయలలో చెడిపోయిన వాటిని పెనుమూరు నుండి పూతలపట్టుకు వెళ్ళే రోడ్డుపైనే పడేస్తుండడంతో, ఆ దారిలో ప్రయాణించే వాహనదారులు జారిపడి గాయాలు కూడా అవు తున్నది.

అలాగే మామిడి పల్పు తీసిన తరువాత వచ్చే మామిడిటెంకలను ఫ్యాక్టరీ యాజమాన్యం ఎక్కడపడితే అక్కడ పడేస్తుండడంతో, చుట్టు పక్కల గ్రామాలు ఆ దుర్గంధానికి బయపడి, పశుపక్ష్యాదులు కూడా తిరగడం లేదు. రసాయనాలు కలిసిన ఫ్యాక్టరీ వ్యర్థాల వలన చుట్టుపక్కల వందల ఎకరాలు సాగుభూములు పంటలు పండించడానికి పనికిరాకుండా అయిపోయాయి. అలాగే ఫ్యాక్టరీ వారు పడేసిన వ్యర్థాల నుండి వెలువడే దుర్వాసన వలన పొలాలలో పశువులు కూడా మేపడానికి పనికిరాకుండా పోతున్నాయి. ప్రకృతిని నాశనం చేస్తూ, రైతుల పాలిట శాపంగా మారిన ఈ 5జి ఫ్యాక్టరి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page