
ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కుతున్న హాస్టల్ వార్డెన్లు
నిబంధనలు పాటించని వార్డెన్లపై కఠిన చర్యలు తీసుకోవాలి
బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ.
BRSV : దేవరకొండ డివిజన్ జులై 05, త్రినేత్రం న్యూస్. విద్యార్థులకు అందుబాటులో లేకుండా విధులు నిర్వర్తిస్తున్న హాస్టల్ వార్డెన్లపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ డిమాండ్ చేశారు.
ఆదివారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడారు, ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమాన్ని పక్కనపెట్టి కొందరు వార్డెన్లు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కుతూ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. హాస్టళ్లలో వార్డెన్లు అందుబాటులో లేకపోవడం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, మార్గదర్శకాలను పాటించని వార్డెన్లపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన వసతి, భద్రత, అవసరమైన సౌకర్యాలు కల్పించేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని బొడ్డుపల్లి కృష్ణ కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe