
-అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
–ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
-బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ.
Fee Regulation Act : దేవరకొండ డివిజన్ జులై 02, త్రినేత్రం న్యూస్. ప్రవేట్ పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలి అని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అన్నారు.గురువారం కొండమల్లేపల్లి పట్టణంలో జరిగిన బిఆర్ఎస్వీ సమావేశం ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ….. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నిచర్, డిజిటల్ విద్యా సదుపాయాలు వంటి మౌలిక వసతులను ప్రభుత్వం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో సర్పంచ్ కావటి వెంకటేష్, పరమేష్, హరికృష్ణ,లింగం,అనిల్,రవి తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe