
Retirement : దేవరకొండ డివిజన్ జులై 01, త్రినేత్రం న్యూస్. దేవరకొండ పెన్షనర్స్ సేవాసధనంలో సహ అధ్యక్షులు గంగిడి దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో యం నారాయణ సింగ్ క్రాప్ట్ టీచర్ ఉద్యోగవిరమణ సన్మాన కార్యక్రమం జరిగినది.
ఈ సందర్బంగా ఆయనను షాలువతో సన్మానించడం జరిగినది. అనంతరం కార్యవర్గ సభ్యులు కోర్వి లక్ష్మయ్య 73వ పుట్టినరోజు సందర్బంగా వారిని శాలువ, కిరీటముతో సన్మానించడం జరిగినది, ఈ సందర్బంగా సేవాసదనం నిర్మాణ నిధికి రూ. 5,000 అందజేసినారు. గతంలో రూ. 15,000 అందజేసినారు అని ప్రధాన కార్యదర్శి అంకం చంద్రమౌళి, కోశాధికారి పంగునూరు లింగయ్య తెలియజేసినారు. ఈ కార్యక్రమం ఉపాధ్యక్షులు ఆకులపల్లి ఐజాక్ సారధ్యములో నిర్వహించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో సంయుక్త కార్యదర్శి వనం బుచ్చయ్య, కార్యనిర్వాహాక కార్యదర్శి మహమ్మద్ యూసుఫ్ షరీఫ్ కార్యవర్గం, కార్యవర్గ సభ్యులు, సభ్యులు పాలుగొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe