జూన్ 28, 2026
TRINETHRAM NEWS
Free Distribution Books Students

Free Distribution Books : దేవరకొండ డివిజన్ జూన్ 27, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో డిల్లీ రమేష్ తో పాటు తూర్పుపల్లి గ్రామానికి చెందిన కుంభం రవితేజ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు పెద్దలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు నిర్మల్ రావు, కుంభం వెంకట్ గౌడ్,అడ్వకేట్ నూనె సురేష్, రమేష్ ,శంకర్, మురళీధర్ రావు మాట్లాడుతూ.. విద్యార్థుల విద్యాభివృద్ధిని కాంక్షిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం ఈ విధమైన సేవా కార్యక్రమాన్ని చేపట్టిన దాతలను అభినందించారు. ఇటువంటి విద్యాదాన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో చదువుపై మరింత ఆసక్తిని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మరియు గ్రామ ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పుస్తకాలు అందుకున్న విద్యార్థులు ఎంతో ఆనందం వ్యక్తం చేయగా, పాఠశాల సిబ్బంది మరియు గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page