
బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్.
Kanchi Mahender : కూకట్పల్లి జూన్ 24 (త్రినేత్రం న్యూస్) : రాష్ట్రవ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభమయ్యే ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి,అర్హత కలిగిన పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఒకే వ్యక్తి పేరు రెండు లేదా అంతకంటే ఎక్కువ ప్రాంతాల్లో నమోదై ఉంటే, అలాంటి ద్వంద్వ ఓట్ల (డబుల్ ఓట్స్) వివరాలను సంబంధిత బూత్ లెవల్ అధికారులకు (బీఎల్ఓ) తెలియజేయాలని కోరారు.
అలాగే మరణించిన వారు లేదా శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉంటే, వాటిని తొలగించే ప్రక్రియకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.ఇంటింటికీ వచ్చే బీఎల్ఓలు మరియు కేఎంవై బృంద సభ్యులకు సరైన సమాచారం అందించి సహకరించాలని ఆయన కోరారు. ఓటరు వివరాల్లో పేరు, చిరునామా, వయస్సు లేదా ఇతర వివరాల్లో పొరపాట్లు ఉంటే వెంటనే సవరణకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ప్రతి కుటుంబం తమ కుటుంబ సభ్యుల ఓటరు నమోదు స్థితిని ఒకసారి పరిశీలించి, అవసరమైన మార్పులు, చేర్పులు చేయించుకోవాలని కంచి మహేందర్ తెలిపారు. స్వచ్ఛమైన, ఖచ్చితమైన ఓటరు జాబితా ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ప్రతి పౌరుడు చురుకుగా పాల్గొని ఎన్నికల సంఘం,బీఎల్ఓలకు సహకరించాలని ఆయన కోరారు. “ప్రతి అర్హుడికి ఓటు ప్రతి ఓటుకు విలువ” అనే లక్ష్యంతో అందరూ ముందుకు రావాలని కంచి మహేందర్ విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe