TRINETHRAM NEWS

Trinethram News : 2017లో ఆఫ్రికా ఖండలోని సియోర్రా లియోన్ లో ఆండ్రో జాన్ సఫియా, కోంబా జాన్ బుల్ అనే ఇద్దరు యువకులు తినడానికి తిండి లేక దీనస్థితిలో ఉన్నారు. వీరితో సహా ఐదు మందితో కలిసి వజ్రాల కోసం వెతికే వారు. ఓ సారి ఈ బృందం నీళ్ల కుంటలో వెతకగా ఓ వజ్రం దొరికింది. 709 క్యారెట్లు ఉన్న ఈ వజ్రం పేరు పీస్ డైమండ్. ఇది ప్రపంచంలోనే 14వ అతి పెద్ద వజ్రంగా రికార్డులోకెక్కింది. ఆ వజ్రం చూడటానికి రాయిలాగే ఉన్నా పట్టుకోగానే చాలా చల్లగా ఉందని ఆ యువకులిద్దరు చెప్పారు. ఇక

ఆండ్రో సఫియా,కోంబా జాన్ బుల్ ఇద్దరు పొట్ట కూటి కోసం స్థానిక పాస్టర్ ఇమాన్యూల్ పని చేశారు. ఆయన వారికి తిండిని స్పాన్సర్ చేసే వారు. ఈ పని చేసినందుకు వీళ్లకు జీతం ఇవ్వరు, కానీ రోజు తిండి పెడతారు. వజ్రం దొరికిన తరువాత వాళ్లు పాస్టర్ ఇమ్మాన్యూల్ కి తెలియజేశారు. ఆయన దానిని మార్కెట్ లో అమ్మకుండా.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి అప్పగించిన ఆ వజ్రాన్ని వేలం వేశారు. ఇక వేలంలో ఆ వజ్రాని దక్కించుకునేందుకు చాలా మంది పోటీ పడ్డారు. వేలంలో ఆ వజ్రం 6.5 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. అంటే ఇండియన్ కరెన్సీలో 84 కోట్ల రూపాయలు ఉంటుంది.

పేదరికంలో మగ్గిపోతున్న వారికి ఈ వజ్రం వెలుగు ఇస్తుందని స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. ఇక బృందానికి లభించిన డబ్బును అందరి సమానంగా పంచాలని నిర్ణయించారు. ఈ క్రమంలో తొలుత అందరికి 80 వేల డాలర్లు ఇవ్వాలని నిర్ణయించారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.66 లక్షల ఇవ్వనున్నారు