డిండి రెసిడెన్షియల్ స్కూల్ లో 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండల కేంద్రంలో లోని గురుకుల పాఠశాల రెసిడెన్షియల్ కళాశాల 76వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ సామాజికవేత్త, దాత ఎన్ జి ఓ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కొర్ర రమేష్. గురుకుల పాఠశాల ప్రదానోపాధ్యులు శిరీష 76వ గణతంత్ర దినోత్సవం వేడుకలు ఘనంగా జాతీయ జెతీయ ఆవిష్కరించిన విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాదాయకమైన ఉపన్యాసం చేశారు.
దేశ అభివృద్ధిలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమైనది. సామాజిక, ఆర్థిక రాజకీయ అంశాలపై దృష్టి సారించి, విజ్ఞాన శాస్త్రంలో రాణించి భవిష్యత్తులో దేశానికి మేలు చేసే నాయకులుగా తీర్చిదిద్దుకోవాలి అని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎన్ జి ఓ స్వచ్ఛత సంస్థ అధ్యక్షుడు కుర్ర రమేష్ నాయక్ విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వేడుకను మరింత వైభవంగా తీర్చిదిద్దారు.
ఈ సందర్భంగా రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వివిధ క్రీడల్లో విజయం సాధించిన విద్యార్థులను అభినందించి, వారికి ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందజేశారు. అలాగే 10వ తరగతిలో 10 జి పి ఏ సాధించే విద్యార్థులకు 10 వేల రూపాయల నగదు బహుమతి ప్రకటించి, విద్యాభ్యాసంలో రాణించేలా ప్రోత్సహించారు.
ఈ కార్యక్రమంలో ఎన్ జి ఓ స్వచ్ఛంద సంస్థం అధ్యక్షులు కొర్ర రమేష్ మరియు బృందం కొర్ర సేవ, కొర్ర రాజేష్, జటవత్ జబ్బర్, కొర్ర నవీన్, సాపవత్ లక్పతి, పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App