జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 26 at 4.21.04 PM

TRINETHRAM NEWS

కమీషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో సుమారు రూ:1,30,38,600/- విలువ గల 521.544 కిలోల గంజాయి దహనం పోలీస్ కమీషనర్
ఎం.శ్రీనివాస్ ఐపియస్

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల వ్యాప్తంగా 2021 సంవత్సరం నుండి వివిధ పోలీసు స్టేషన్ లలో నమోదైన 64 కేసుల్లో నిందితుల నుండి సీజ్ చేసిన ప్రభుత్వ నిషేధిత గంజాయి 521.544 కిలోలను, యన్.డి.పి.యస్. చట్ట ప్రకారం కోర్టు అనుమతి తీసుకుని, న్యాయాధిపతుల ముందు కేసు ప్రాపర్టీని యఫ్.యస్.ఎల్. కొరకు శాంపిల్ తీసి మిగిలిన మొత్తాన్ని కమీషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు తేది:26-11-2024 నాడు కరీంనగర్ జిల్లా మానకొండూర్ వెంకటరమణ ఇన్సినేటర్ ఫ్యాక్టరీ వద్ద పర్యావరణ కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటిస్తూ దహనం చేయడం జరిగిందని, దహనం చేసిన నిషేధిత గంజాయి విలువ సుమారు 1,30,38,600/- రూపాయలు ఉంటుందని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి తెలిపారు.. కమీషనరేట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ చైర్మన్ సీపీ మరియు కమిటీ సభ్యులైన
C.రాజు అడిషనల్ డీసీపీ అడ్మిన్ రామగుండం, గోదావరిఖని ఎసిపి ఎం .రమేష్, జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఎసిపి మల్లారెడ్డి, సిసిఆర్బీ ఇన్స్పెక్టర్ జి. సతీష్ , మల్లేష్ అడ్మిన్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో దహనం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ NDPS యాక్ట్ లోని నియమనిబంధనల ప్రకారం రామగుండం పోలీస్ కమీషనరేట్ పలు పోలీస్ స్టేషన్లలో నమోదు చేయనడిన కేసులలో నిల్వ ఉన్న గంజాయిని ఈ రోజు దహనం చేయడం జరిగిందని తెలియజేసారు. కొందరు దురుద్దేశ్యంతో అక్రమార్జనలో భాగంగా అక్రమ గంజాయి సాగు, విక్రయిస్తూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ప్రలోభాలకు గురి చేస్తూ మత్తులోకి దించుతున్నారన్నారు. అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిని అరికట్టడం కోసం స్థానిక, స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ద్వారా విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఎవరైనా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను విక్రయిస్తే చట్టరీత్య కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇకపై మత్తుకు బానిసలై గంజాయి లాంటి మత్తు పదార్ధాలను సేవించే వారిపై కూడా చట్టపరమైన కేసులు నమోదు చేసి పిడి యాక్ట్ కు కూడా అమలు చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్.డిసిపి అడ్మిన్ సి.రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, గోదావరిఖని ఎసిపి ఎం.రమేష్, జైపూర్ ఎసిపి ఎ.వెంకటేశ్వర్లు, టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి, ఏ.ఆర్ ఏసిపి సుందర్రావు, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ సతీష్, ఆర్ ఐ లు దామోదర్ మల్లేశం లు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page